ట్విట్టర్ వేదికగా వైసీపీపై బుద్ధా విమర్శలు

By రాణి  Published on  30 Jan 2020 12:05 PM GMT
ట్విట్టర్ వేదికగా వైసీపీపై బుద్ధా విమర్శలు

  • 'నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్' అంటూ వైసీపీకి కౌంటరిచ్చిన బుద్ధా

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అధికార, ప్రతిపక్షాల పార్టీలకు మధ్య సోషల్ మీడియాలో జరిగే రగడ అంతా ఇంతా కాదు. పొద్దున లేస్తే రాత్రి నిద్రపోయేంత వరకూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే పనైపోయింది మన నేతలకు. వైసీపీ టీడీపీ పై అసభ్యకర పోస్టులు పెట్టి, సెటైర్లు వేసి కవ్విస్తుంటుంది. అవి చూసి అప్పుడప్పుడు తెలుగు తమ్ముళ్లు మిన్నకున్నా...ఒళ్లు మండితే మాత్రం అమాంతం విరుచుకు పడిపోతారు. ఇప్పుడు కూడా వైసీపీ చేసిన ఒక పోస్ట్ ను చూసి టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీరియస్ అయ్యారు.

బుద్ధా వెంకన్న వేయించిన ఫ్లెక్సీని వైసీపీ కార్యకర్తలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఫ్లెక్సీలో చంద్రబాబును పొగుడుతూ రాస్తే..వైసీపీ చంద్రబాబును కించపరుస్తూ మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసింది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ''వైకాపా మార్ఫింగ్ ట్రిక్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. @ysjagan గారు దొంగ అయితే అంతకంటే పెద్ద దొంగలు అని వైకాపా కార్యకర్తలు నిరూపించుకుంటున్నారు. ఆయన వేసే ముష్టి 5 రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు.'' అని ట్వీట్ లో రాసుకొచ్చారు. దాని కిందే ఫేక్, రియల్ అంటూ రెండు ఫొటోలను జత చేశారు. ''ఆరోపణలు చేసుకోండి అంతే కాని ఇలాంటి చిల్లర పనులు చెయ్యకండి. ఇదే కొనసాగితే మీ అధినేత జగన్ దొంగ బతుకు బయటపెడుతూనే ఉంటా..'' అని హెచ్చరించారు.



''నేను విన్నాను, నేను ఉన్నాను అంటే @ysjagan గారు గుర్తుకు రారు @VSReddy_MP గారు.. అధికార దాహంతో ఆయన అడ్డగోలుగా ఇచ్చిన హామీలు, కుర్చీ ఎక్కిన తరువాత ప్రజల్ని మోసం చేసిన తీరు గుర్తుకువస్తుంది.''

''ఒక్క సారి గ్రామాల్లో తిరగమనండి మేము ఉన్నాము, బడిత పూజ చేస్తాము అంటున్నారు ప్రజలు. ఒక్క సారి జగన్ గారిని గ్రామాల్లోకి పంపండి అప్పుడు అర్ధం అవుతుంది ఎవరి ఇమేజ్ ఏంటో..''

''మీరు, @ysjagan గారు పత్రికా విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. తెలుగు వారి మనస్సాక్షి సాక్షి పేపర్ అంటూ జగన్ గారు ఘోరమైన స్టేట్ మెంట్ లు ఇచ్చినప్పుడు మీ బుద్ధి ఏం అయింది @VSReddy_MP గారు? నిత్యం మీ బ్రోకర్ పనులకు మడుగులు ఒత్తే చెత్త పేపర్, ఛానల్ ని తెలుగువారి మనస్సాక్షి అంటూ బిల్డ్ అప్ ఇచ్చినప్పుడు ధార్మికతను ఆపాదించినట్టు అనిపించలేదా? '' అని ప్రశ్నించారు.

''బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్తే తడుపుకొని మండలి రద్దు చేసిన మీరా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడేది? 151 మంది ఉన్నాం అని చెప్పి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నప్పుడే మీ వాడికి సీన్ లేదు అని అర్థం అయ్యింది.'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

వివేకా హత్యపై విజయసాయిని విచారణ చేయాలి

అలాగే వివేకా హత్య పై కూడా బుద్ధా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో విజయసాయిరెడ్డిని కూడా సీబీఐ చే విచారణ చేయించాలని సునీత హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారు. ''వివేకా హత్య కేసులో @VSReddy_MP గారిని కూడా సీబీఐ విచారించాలని వివేకా గారి కుమార్తె సునీత గారు కోర్టులో పిటిషన్ వెయ్యాలి. వివేకా గారు చనిపోయిన రోజు సాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ సంభ్రమాశ్చర్యాలకు గురైనట్టు చెప్పారు.'' అని పేర్కొంటూ..ఆ ట్వీట్ కిందనే విజయసాయిరెడ్డి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.



''వైఎస్ గారి తమ్ముడు, @ysjagan గారి బాబాయ్ చనిపోతే సాయిరెడ్డి గారు ఎందుకు సంబరాలు చేసుకున్నారు. ఆయనే స్వయంగా సంభ్రమాశ్చర్యాలకు గురైనట్టు ప్రకటించారు. విజయ్ గారికి నార్కో అనాలిసిస్ చేస్తే వివేకా హత్య చిక్కుముడి విడిపోతుంది. ఆయన సంభ్రమాశ్చర్యాలకు ఎందుకు గురైయ్యారో తేలిపోతుంది.'' అన్నారు.

Next Story