రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న టీఆర్ఎస్  ఎంఎల్ఏ వాహనం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:57 AM GMT
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న టీఆర్ఎస్  ఎంఎల్ఏ వాహనం

మహేశ్వరం: శ్రీశైలం హైవే పైన, మహేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. బైక్ మీద రోడ్డు దాటుతున్న జగన్నాధరావు అనే అతడిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం ఢీ కొట్టింది. దీంతో జగన్నాధరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన తరువాత ఎమ్మెల్యే వాహనాన్ని స్థానికులు చుట్టుముట్టారు. వాహనాన్ని అక్కడే వదిలేసి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

జగన్నాధరావుది శ్రీకాకుళం. మహేశ్వరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారు. ఆదివారం, సుమారు 8 గం.లకు ఎం ఎల్ ఏ వాహనం కల్వకుర్తి నుంచి హైదరాబాదు వస్తుండగా, జగన్నాథ రావును ఢీ కొట్టింది. అతను స్పాట్ లోనే మృతి చెందాడు. దీంతో ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని గ్రామస్తులు ధర్నాకు దిగారు.

అయితే, పోలీసులు జోక్యం చేసుకొని, తప్పకుండా న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చాకే అందరూ అక్కడి నుంచి కదిలారు. ఎం ఎల్ ఏ డ్రైవర్ పైన కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు.

Next Story
Share it