టీడీపీ ఎమ్మెల్యేతో రోజా సెల్ఫీ..!

By రాణి  Published on  23 Jan 2020 6:40 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేతో రోజా సెల్ఫీ..!

టీడీపీ పేరు చెప్తేనే మండిపడే నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేతోనే సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ సెల్ఫీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. రోజా రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైనప్పటికీ..ఆ పార్టీకి ఈమెకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందిప్పుడు పరిస్థితి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించడంతో ఎమ్మెల్యే రోజా సెల్ఫీలు తీసుకున్నారు. వీటిపై నెటిజన్లు మండిపడట్లేదు గానీ...వారిద్దరూ కలిసి సినిమాలు చేసిన చనువుతోనే ఆవిడ ఇలా సెల్ఫీలు దిగారని సమర్థిస్తుండటం విశేషం.

Mla Roja Selfie With Balakrishna

ఈ సెల్ఫీని పరిపాలన వికేంద్రీకరణ - సమగ్రాభివృద్ధి బిల్లు తో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన వీక్షకుల గ్యాలరీలో తీసుకున్నారట. ఇటు అధికార పక్ష ఎమ్మెల్యేలు, అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మండలిలో జరిగిన చర్చను చూసేందుకు ఈ గ్యాలరీకి చేరుకున్నారు. అక్కడ బాలయ్య పక్కనే కూర్చున్న రోజా తన ఫోన్ లో ఈ సెల్ఫీని క్లిక్ మనిపించారు. ఈ సెల్ఫీలో బాలకృష్ణతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు...ఇంకా టీడీపీ చెందిన నేతలు కూడా ఉండటం పెద్ద విశేషమనే చెప్పాలి.

ఈ సెల్ఫీపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసి...ప్రెట్టీ రోజా పక్కన కూర్చుని ఈ ఫొటోని స్పాయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరో చెప్పండంటూ ట్వీట్ చేశారు. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఆర్జీవీ పై తిట్లదండకం అందుకున్నారు. గతంలో ఆర్జీవీ బాలయ్యపక్కన కూర్చుని దిగిన ఫోటోలను రిప్లై ఇస్తూ...ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.Next Story