ఎమ్మెల్యే ఆర్‌కే రోజా : నా కొడుకునే కిడ్నాప్ చేస్తాడా..?

By అంజి  Published on  6 Jan 2020 9:31 AM GMT
ఎమ్మెల్యే ఆర్‌కే రోజా : నా కొడుకునే కిడ్నాప్ చేస్తాడా..?

అవును, ప్ర‌ముఖ న‌టి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ శాస‌న స‌భ్యురాలు ఆర్‌కే రోజా కొడుకు కిడ్నాప్ అయ్యాడు. ఆ విష‌యాన్ని కిడ్నాప‌ర్లు ఫోన్ చేసి మ‌రీ రోజాకు చెప్పారు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. మీ అబ్బాయిని వ‌దిలిపెట్టాలంటే..! అంటూ వారి డిమాండ్‌లు రోజా ముందుంచారు. దీంతో ''ఒక ఎమ్మెల్యే కొడుకునే కిడ్నాప్ చేస్తారా..?'' అంటూ రోజా ఫైర్ అయింది. అదేంటి..? ఈ స‌మాజంలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబానికే భ‌ద్ర‌త లేన‌ప్పుడు ఇక సాధారణ ప్ర‌జ‌ల ప‌రిస్థితేంటి..? అన్న ప్ర‌శ్న మీలో త‌లెత్తవ‌చ్చు. అంతేకాక, ఇంత‌కీ రోజా కొడుకును కిడ్నాప‌ర్లు రిలీజ్ చేశారా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

కాగా, ఆర్‌కే రోజా న‌గ‌రి ఎమ్మెల్యేగానే కాకుండా ఏఐసీసీ చైర్మ‌న్‌గానూ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఏపీలో వైసీపీకి అధికారం ప‌క్కా అని ఎన్నిక‌ల ఫ‌లితాలు తేల్చిన నేప‌థ్యంలో రోజాకు మంత్రి ప‌దవి ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా సీఎం జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. దాంతో కేబినేట్ బెర్త్ లిస్ట్‌లో రోజా పేరు క‌నిపించ‌లేదు. రోజా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఆమె నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తోపాటు అభిమానులు ఉసూరుమ‌న్నారు.

ఏదేమైనా ఏఐసీసీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం రోజాను కాస్త శాంతింప చేసింద‌నే చెప్పాలి. మ‌రోప‌క్క‌, ప్ర‌భుత్వ ఏర్పాటు స‌మ‌యంలో రెండున్న‌రేళ్ల త‌రువాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుందని జ‌గ‌న్ చెప్పిన మాట‌ను రాజ‌కీయ విశ్లేషుకులు గుర్తు చేస్తున్నారు. సీఎం జగ‌న్ కీల‌క శాఖ‌ను రోజాకు అప్ప‌గిస్తారని, దాంతో రోజా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంద‌డం ఖాయ‌మ‌న్న సంకేతాల‌ను వారు సూచిస్తున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉంటూనే బుల్లితెరపై క‌నిపిస్తున్న అతి త‌క్కువ మందిలో ఒక‌రిగా రోజా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది.

ఇక ఎమ్మెల్యే రోజా అబ్బాయి కిడ్నాప్ విష‌యానికొస్తే, ఇటీవ‌ల కాలంలో బుల్లితెర ఛానెళ్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే అమ్మ నాన్న ఓ సంక్రాంతి షో ఈ సంక్రాంతి ప‌ర్వదినాన ప్ర‌సారం కానుంది. పిల్ల‌లు కిడ్నాప్ నేప‌థ్యంలో ఈ షో కొన‌సాగుతుంది. రోజా, సుడిగాలి సుధీర్‌, ఆటో రామ్ ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌నుతోపాటు మ‌రికొంద‌రు క‌మెడియ‌న్ల కొడుకులు కిడ్నాప్‌కు గుర‌వుతారు. తాజాగా విడుద‌లైన ఈ షో ప్రోమో బుల్లితెర ఆడియ‌న్స్‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

అమ్మ నాన్న ఓ సంక్రాంతి

ప్రోమోలో మొద‌ట ఎంట్రీ ఇచ్చిన రోజా ఎప్ప‌టిలానే త‌న డాన్స్‌తో ఆక‌ట్టుకుంది. ఆ వెంట‌నే ''ప్ర‌దీప్ వాడికెంత ధైర్యం ఉండాలి..? ఒక ఎమ్మెల్యే కొడుకునే కిడ్నాప్ చేస్తాడా..?'' అంటూ ప్ర‌శ్నిస్తుంది. దాంతో.. పిల్ల‌లు కిడ్నాపేంటి..? అంటూ ప్రదీప్ ఎదురుప్ర‌శ్న. ఇక‌ అక్క‌డ్నుంచి షో ఆద్యాంతం ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది. రోజాతోపాటు కంటెస్టెంట్‌లు స‌ప‌రేటుగాను, పిల్ల‌ల‌తో క‌లిసి హైప‌ర్ ఆది స‌ప‌రేట్‌గానూ సంక్రాంతి వేడుక‌లు జ‌రుపుకోవ‌డ‌మే ఈ షో కాన్సెప్ట్‌గా తెలుస్తుంది. మ‌రీ ముఖ్యంగా పిల్ల‌లు చేసిన అల్ల‌రి ఈ షోకు హైలెట్‌గా నిల‌వ‌నుంది. గ‌త ఏడాది ద‌స‌రా నాడు వారి త‌ల్లిదండ్రుల‌ను, భార్య‌ల‌ను మాత్ర‌మే బుల్లితెరకు ప‌రిచ‌యం చేసిన కంటెస్టెంట్స్‌, ఈ సంక్రాంతికి మాత్రం త‌మ పిల్ల‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ అమ్మ నాన్న ఓ సంక్రాంతి షో ప్రోమో మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Next Story