విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా యువతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 8:05 AM GMT
విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా యువతి

అట్లాంటా : 2019 విశ్వసుందరి కిరీటాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ దక్కించుకుంది. అమెరికాలోని జార్జియా రాజధాని అయిన అట్లాంటాలో జరిగిన విశ్వసుందరి 2019 ఫైనల్స్ లో టుంజీని విజేతగా ప్రకటించారు. 2018 విశ్వసుందరి అయిన కాట్రియోనా గ్రే టుంజీ కి కిరీటాన్ని అలంకరించి అభినందించారు. ఈ పోటీల్లో మొత్తం 90 మంది పాల్గొనగా జోజిబిని టుంజీ విజేతగా ఎంపికైంది. మిస్ యూనివర్స్ మెక్సికో సోఫియా ఆరాగన్, మిస్ యూనివర్స్ ప్యూర్టోరికా మాడిసన్ అండెర్సన్ రన్నరప్ లుగా నిలిచారు. ఫైనల్ విజేతను ప్రకటించే కొద్ది క్షణాల ముందు టుంజీ మాట్లాడుతూ..''నా రంగు, జుట్టు చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇకపై అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదేనని నేను భావిస్తున్నా'' అని చెప్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. టుంజీ (26) స్వస్థలం దక్షిణాఫ్రికాలోని సోలో. ఆమె లింగ ఆధారిత వివక్ష, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అయితే భారత్ కు చెందిన వర్తికా సింగ్ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ టాప్ 20లో ఆమె స్థానాన్ని సంపాదించుకోలోకపోయారు.

Next Story