క్రికెట్ ఆడుకుందాం..కశ్మీర్‌ గురించి ఎందుకు- పాక్ కోచ్‌ మిస్బా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 11:10 AM GMT
క్రికెట్ ఆడుకుందాం..కశ్మీర్‌ గురించి ఎందుకు- పాక్ కోచ్‌ మిస్బా

కరాచీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్‌ పీఎంతోపాటు అక్కడ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. అంతేకాదు..కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అంటూ పాక్ క్రికెటర్లు ధ్వజమెత్తారు. దీనిపై యూఎన్‌ఓ జోక్యం చేసుకోవాలని షాహిద్ ఆప్రిది కోరాడు. కశ్మీర్‌ ప్రజలకు ఇది చాలా కష్టకాలమంటూ కెప్టెన్ సర్ఫరాజ్ స్పందించాడు.

Image result for afridi sarfaraj khan

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ ఆ దేశ మాజీ క్రికెటర్‌ మిస్బావుల్‌ ..కశ్మీర్‌ గురించి మనకెందుకు అన్నాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు సిద్ధమైన టైమ్‌లో మిస్బా ప్రెస్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కశ్మీర్‌ గురించి మీ అభిప్రాయం ఏంటని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మిస్బా చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. "మనం ఇక్కడకు క్రికెట్ ఆడటానికి వచ్చాం..కశ్మీర్‌ గురించి మాట్లాడటానికి కాదుగా" అంటూ వెళ్లిపోయాడు.

Image result for kashmir map

Next Story
Share it