దిశ పీఎస్ హోంగార్డు మాటలు నమ్మిన మైనర్ బాలిక..

By రాణి  Published on  22 Feb 2020 11:24 AM GMT
దిశ పీఎస్ హోంగార్డు మాటలు నమ్మిన మైనర్ బాలిక..

మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆల్యంగా వెలుగుచూసింది. హోంగార్డు మాటలు విని అతడు చెప్పినట్లు చేసిన మైనర్ బాలిక గర్భవతి అయింది. కూతురి శరీరంలో మార్పులను గమనించిన తల్లి..ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి చిలకలపూడి పీఎస్ లో ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దుశ్చర్యకు పాల్పడిన దుర్మార్గపు హోం గార్డు సాక్షాత్తు దిశ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నవాడే కావడం గమనార్హం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే..ఇక ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ ఉంటుందని పలువురు పెదవి విరుస్తున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. దిశ యాప్ ను కూడా ఆవిష్కరించారు. ఈ యాప్ సహాయంతో ఇటీవలే ఒక మహిళ రక్షణ పొందితే.. ఇప్పుడొక మైనర్ బాలిక అదే దిశ పీఎస్ కు చెందిన పోలీస్ బారిన పడి గర్భం దాల్చింది. ఇలా వెలుగులోకి రాని ఘటనలెన్నో ఉంటున్నాయి. పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసే చాలా మంది ఆడపిల్లలు తమ పై జరుగుతున్న ఘెరాలను ఇంకా భరిస్తూనే ఉన్నారు. చీకట్లోనే మగ్గుతున్న ఎంతో మంది ఆడపిల్లలు మేల్కొని తమ జీవితాల్లోకి వెలుగు నింపుకోవాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి.

Next Story