మొబైల్ పోగొట్టుకున్న మంత్రి పేర్ని.. లొకేషన్ చూస్తే..

By రాణి  Published on  6 Feb 2020 9:20 AM GMT
మొబైల్ పోగొట్టుకున్న మంత్రి పేర్ని.. లొకేషన్ చూస్తే..

మంత్రి పేర్నినాని మొబైల్ చోరీకి గురైంది. బుధవారం మంత్రి పేర్ని నాని సచివాలయంలో నిర్వహించిన వివిధ సమావేశాలకు హాజరయ్యారు. మొదట ఆర్థిక శాఖ సమావేశానికి హాజరై..ఆ తర్వాత అక్కే సందర్శకులతో భేటీ అయ్యారు. అనంతరం సచివాలయంలో జరిగిన పలు సమావేశాలలో పాల్గొని మధ్యాహ్న సమయంలో సచివాలయ క్యాంటీన్ లో భోజనం చేశారు. ఆ సమయంలో తన ఫోన్ కోసం వెతుకగా..కనిపించలేదు. దీంతో తన మొబైల్ ను ఎవరో దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని పిలిచి తన ఫోన్ గురించి ఆరా తీయగా..మంత్రి వెళ్లిన ప్రదేశాల్లో తనిఖీ చేశారు. ఎక్కడా లేకపోవడంతో మొబైల్ ఎక్కడుందో సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. అప్పటికే ఫోన్ రాష్ర్టం దాటి వెళ్లిపోయిందని తెలిపారు. లొకేషన్ ఆధారంగా పేర్ని మొబైల్ నల్గొండ జిల్లాలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సాధారణంగా మన మొబైల్ పోతేనే ఎవడు కొట్టేశాడో..ఏం చేస్తున్నాడో అని చక చకా ఈ మెయిల్ ద్వారా ఆ మొబైల్ ఉన్న డేటాని తొలగించేస్తాం. ఇప్పుడు మిస్సయింది మంత్రిగారి మొబైలయ్యే..పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోదుగా..ఏదొక రకంగా మొబైల్ దొంగిలించినవాడెవడో కనిపెడతారు. బాగానే ఉంది. కానీ ఆ మొబైల్ లో ఏవైనా రాజకీయ సంభాషణలు రికార్డ్ అయి ఉంటే మాత్రం డేంజరేనండోయ్. అసలే రాష్ర్టానికి మూడు రాజధానులు కావాలంటూ వైసీపీ ప్రకటించినప్పటి నుంచి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు కేంద్రం కూడా అమరావతే ఆంధ్రా రాజధాని అని చెప్పీ చెప్పకుండా చెప్పింది. ఇలాంటి తరుణంలో మంత్రిగారి మొబైల్ మిస్సవ్వడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే రాజధానులకు సంబంధించిన ప్రకటన సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించేసి పారిపోయారు గానీ...ఆ తర్వాత జరిగిన సమావేశాల సారాంశాన్ని మన మంత్రిగారే మీడియాకు వివరించారు. అసలు ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు పెడుతున్నట్లు ? దీనివల్ల వైసీపీ కి వచ్చే లాభాలేంటి ? అమరావతి నుంచి రాజధానిని తరలించడం వెనక కుట్రేమైనా ఉందా ? వీటికి సంబంధించిన సంభాషణలు పోయిన మొబైల్ లో ఉంటే గనుక మంత్రి గారు ఇరకాటంలో పడ్డట్లే. ఇక మొబైల్ దొరికే వరకూ ఈయనకు కంటి మీద కునుకుండదనుకోండి.

Next Story