క‌ల‌క‌లం రేపుతున్న‌ఆడియో టేపు..

By Newsmeter.Network  Published on  16 Jan 2020 9:27 AM GMT
క‌ల‌క‌లం రేపుతున్న‌ఆడియో టేపు..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కేటాయింపు ఆ పార్టీ నేతల‌ మ‌ధ్య చిచ్చు పెట్టిందా..? త‌న వ‌ర్గం నేత‌ల‌కు కాకుండా వేరే వారికి మంత్రి టిక్కెట్లు ఇచ్చాడంటూ టీఆర్ఎస్ నేత ఆరోపించిన ఆడియో టేపు ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. మంత్రి మ‌ల్లారెడ్డికి టీఆర్ఎస్ నేత రాపోలు రాములు మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ‌గా ఉన్న ఆ ఆడియోలో ఏం ఉందంటే...?

‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. నీ వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కూడా నీ గురించి చెప్తానని రాపోలు బెదిరించగా, చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని వెల్లడించారు.

Next Story