అమరావతి : సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ లతో భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు అంశం పైనే ప్రధానంగా ఈ భేటి జరిగినట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించి హై కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైనా ఈ భేటిలో చర్చించినట్లు సమాచారం.

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలిలో ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ప్రకటించారు. దీంతో శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.