మంత్రి బుగ్గన తో సీఎం జగన్ భేటి.. శాసనమండలి రద్దుపైనే..!
By Newsmeter.NetworkPublished on : 25 Jan 2020 1:05 PM IST

అమరావతి : సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ లతో భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు అంశం పైనే ప్రధానంగా ఈ భేటి జరిగినట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించి హై కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైనా ఈ భేటిలో చర్చించినట్లు సమాచారం.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలిలో ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. దీంతో శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Next Story