పోలీసు శిబిరంపై దాడి.. 11 మంది మృతి

By సుభాష్  Published on  28 Jan 2020 4:36 PM GMT
పోలీసు శిబిరంపై దాడి.. 11 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న ఓ పోలీసు శిబిరంపై సోమవారం అర్ధరాత్రి కొందరు తాలిబన్ మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బందిలో ఒకరు మిలిటెంట్లకు సహకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మిలిటెంట్లు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న చెక్ పోస్టుపై దాడి చేసిన సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు వారికి గేటు తెరిచి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ కారణంతోనే మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడినట్లు బాల్ఘన్ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు మాబూబుల్లా గఫారీ మంగళవారం మీడియాకు వివరించారు.

ఇక స్థానిక పోలీసు అధికారి కూడా మీడియా ముందు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. గత ఆప్ఘనిస్తాన్ లో 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో మిలిటెంట్లు అధికంగా అమెరికా, నాటో దళాలను లక్ష్యం చేసుకుని ఈ దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. భద్రతా సిబ్బందిపై, కాన్వాయ్ లపై చేసిన దాడుల్లో చాలా మంది మృతి చెందారు.

Next Story