గోవా తీరంలో కూలిన మిగ్‌-29కె విమానం

భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కె శిక్షణ విమానం ఆదివారం గోవా తీరంలో కూలిపోయింది. కాగా.. ఈ ప్రమాదం నుంచి ఫైలెట్‌ క్షేమంగా బయటపడ్డాడు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు తెలిపారు. రోజువారీ శిక్షణలో భాగంగా బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

తాజా ఘటనపై విచారణకు భారత నౌకాదశం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్‌లో ఇదే రకానికి చెందిన విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. పక్షులు అడ్డురావడంతో ఇంజిన్‌ మొరాయించి ప్రమాదం సంభవించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్