హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. రెండు కారిడార్లలో ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీ శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలలోపు 42 వేల మంది ప్రయాణిస్తారని, కానీ, ఇవాళ ఉదయం 10 గంటల వరకు 78 వేల మంది ప్రయాణించారని ఆయన చెప్పారు. ఈ రోజు 810 ట్రిప్పులు నడిపేందుకు ప్రణాళిక వేశామని.. 10 గంటల వరకు 100 ట్రిప్పులు పూర్తి చేశామని శ్రీధర్‌రెడ్డి అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.