ఎట్టకేలకు దిగొచ్చిన మెట్రో అధికారులు

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 Sept 2019 6:41 PM IST

ఎట్టకేలకు దిగొచ్చిన మెట్రో అధికారులు

హైదరాబాద్‌: అమీర్‌ పేట్ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి పడి ప్రాణాలు కోల్పోయిన మౌనిక కుటుంబానికి నష్టం పరిహారం ఇవ్వడానికి అధికారులు ఒప్పుకున్నారు. రూ.20లక్షల నష్ట పరిహారంతోపాటు..మెట్రో ప్రమాదంలో చనిపోయేవారికి ఇచ్చే ఇన్సూరెన్స్‌ వర్తింపచేయనున్నారు. అంతేకాదు..కుటుంబ సభ్యుల్లో ఒకరికి మెట్రో ఉద్యోగం ఇవ్వడానికి ఎల్ అండ్ టీ అధికారులు ఓకే అన్నారు. మౌనిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కూకట్‌పల్లిలోని ఆమె ఇంటికి తరలించారు.

Next Story