చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదు..వైద్య పరీక్షలు చేయించాలి..!- సుచరిత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2019 8:40 PM ISTఅమరావతి: సీఎం జగన్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. డీజీపీని పట్టుకుని నకరాలు పడుతున్నావా అనడంపై కూడా మండిపడ్డారు. చంద్రబాబుకు మానసిక స్థితి బాగోలేదు...వైద్యం చేయించాలన్నారు. పోలీసులను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు ఇలా ఉంటే..అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందని..మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందన్నారు. కేంద్ర మానవ హక్కుల సంఘం రిపోర్ట్‌ను బహిర్గతం చేస్తామన్నారు. ఖాకీ చొక్కాలు వేసుకుని పోలీసులు స్వచ్ఛందంగా ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు సుచరిత. అగ్రి గోల్డ్ భూములను చంద్రబాబు కొట్టేయాలని చూశారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం సుచరిత.
Next Story