డిఫెన్స్ ఎక్వీఫ్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చర్ లో అడుగుపెట్టిన మేఘా కంపెనీ

By సుభాష్  Published on  15 Jun 2020 8:59 PM IST
డిఫెన్స్ ఎక్వీఫ్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చర్ లో అడుగుపెట్టిన మేఘా కంపెనీ

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎం.ఇ.ఐ.ఎల్.) సంస్థ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ను తయారు చేయడంలో అడుగుపెట్టింది. 500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లను ఈ సంస్థ పెట్టడానికి సిద్ధమైంది. హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతంలో కంపెనీ రక్షణ రంగానికి ఉపయోగపడే సామాగ్రిని తయారు చేసే యూనిట్ ను మొదలుపెట్టబోతోంది. హోం మినిస్ట్రీ, కామర్స్ మినిస్ట్రీ సంస్థకు పర్మిషన్స్ అందించింది.

డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020 ప్రకారం ఆయుధాలు, వాహనాలు మొదలైనవాటిని తయారు చేయనున్నారు. అనుకున్న అప్రూవల్స్ లభించాయని.. డిఫెన్స్ పరికరాలు, ఆయుధ సామాగ్రిని హైదరాబాద్ గడ్డపై తయారుచేయనుండడం పట్ల చాలా ఆనందంగా వుందని ఎం.ఇ.ఐ.ఎల్. సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు. భారత ప్రధాని చెప్పిన మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా ఈ కంపెనీని మొదలుపెట్టనున్నామన్నారు.

యుద్ధానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు, లైట్ కంబాట్, ఆర్మర్డ్ ఇంజనీర్ రికవరీ, ఆర్మర్డ్ రికవరీ వాహనాలను తయారుచేయనున్నారు. సైనికులను తీసుకుని వెళ్లే వాహనాలు, పదాతి దళములకు కావలసిన వస్తువులను, మైన్ లేయింగ్, బ్రిడ్జ్ లేయింగ్, భూభాగం మీద నడిచే వాహనాలను తయారు చేయనున్నారు. భవిష్యత్తులో మిసైల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు, మెషీన్ గన్స్, రాకెట్స్, కెనాన్స్, ఎక్విప్మెంట్ మిసైల్స్ ను తయారుచేయనున్నారు.

ఎం.ఇ.ఐ.ఎల్. కంపెనీ నిర్మాణ రంగంలో చాలా పెద్ద పేరును సొంతం చేసుకుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, డ్రింకింగ్ వాటర్, పవర్ జనరేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్, రహదారులు, ఏవియేషన్ సెక్టార్స్ లో సేవలు అందించింది. ఎన్నో ప్రముఖ ప్రాజెక్ట్స్ లో తమ వంతు సహాయాన్ని అందించింది.

ఎం.ఇ.ఐ.ఎల్. గ్రూప్ కు చెందిన IComm Tele Ltd నేషనల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ లో భాగస్వామ్యం అయింది. అడ్వాన్స్ కమ్యూనికేషన్స్ రేడియోలు, జామర్లు, షెల్టర్లు, యాంటెన్నా, ఎలెక్ట్రానిక్ వార్ఫేర్ కంటైనర్లు, విండ్ ప్రొఫైల్స్, రాడార్లను తయారుచేయనున్నారు. అలాగే మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఏప్రిల్ నెలలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ లాంఛ్ చేశారు.

ఎం.ఇ.ఐ.ఎల్. గ్రూప్ హంద్రీ నీవా సుజల శ్రవంతి, పట్టిసీమ ప్రాజెక్టులలో భాగస్వామ్యం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎం.ఇ.ఐ.ఎల్. పని తీరును అందరూ మెచ్చుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్ద పెద్ద వర్క్స్ పూర్తీ చేసింది ఎం.ఇ.ఐ.ఎల్. సంస్థ. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తీ చేసింది.

Next Story