ఆపరేషన్ కలరిజం : మేఘన తల్లాప్రగడ

By Bala Maram Reddy  Published on  13 May 2020 6:55 AM GMT
ఆపరేషన్ కలరిజం : మేఘన తల్లాప్రగడ

లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ (ఎల్.ఎఫ్.జె.సి.) పూర్వ విద్యార్థులతో కాలేజీకి ఉన్న బంధాలను అనుబంధాలను తెలుసుకుంటూ.. వారు ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగారు, ఏవిధమైన సూచనలను భవిష్యత్ తరాలకు అందిస్తూ ఉన్నారు ప్రొఫెసర్ బాల మారం రెడ్డి. తన LJFC గ్లోబల్ వెబ్ సిరీస్ లో భాగంగా మేఘన తాళ్లప్రగడతో షోను నిర్వహించారు.

M4

2004 లో మేఘనా తల్లాప్రగడ తమ కాలేజీ నుండి వెళ్లిందని.. ఆ తర్వాత ఆమె సి.బి.ఐ.టి.లో ఇంజనీరింగ్ పూర్తీ చేసింది. అమెరికాకు వెళ్లి నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ ను పూర్తీ చేసిందని.. కార్నెల్ యూనివర్సిటీ నుండి ఆమె పిహెచ్డీ పట్టాను పొందారు. ప్రస్తుతం ఆమె టెంపుల్ యూనివర్సిటీలో అడ్వేర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తోంది.

మనిషి రంగు గురించి భారత్ లో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుందని.. కానీ ఇలా మనిషి రంగు గురించి చర్చ ప్రతి దేశంలోనూ జరుగుతూనే ఉందని.. దానిపై నేను మాట్లాడుతూనే ఉన్నానని.. ఈ బేధాలు లేకుండా చేయాలనే తాను 'కలరిజం' అనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టానని మేఘన తెలిపారు. మనిషి శరీర రంగు గురించి ఎందుకు అంతగా చర్చిస్తున్నారు.. కలర్ ముఖ్యమా.. మనిషి ముఖ్యమా అన్న విషయాన్ని తమ ప్రాజెక్ట్ లో భాగంగా అందరికీ తెలియజేస్తున్నామని మేఘన తెలిపింది. అందుకు తన మార్షల్ ఆర్ట్స్ కూడా ఉపయోగపడ్డాయని మేఘనా చెప్పగా.. అందుకే నిన్ను 'ఘనాపాటి మేఘన' అంటున్నామని బాల మారం రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

M2

రంగు కారణంగా మనుషులను విభజిస్తూ ఉన్నారని.. ఇది ఒకప్పటి నుండి జరుగుతూనే ఉందని.. ఇప్పటికైనా మనుషుల్లో మార్పులు రావాలనే తాను ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టానని మేఘన తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎక్కడో ఒకచోట రంగు విషయంలో వివక్షను ఎదుర్కొని ఉంటారని బాల మారం రెడ్డి అన్నారు. భారతదేశంలో కూడా కులం, మతం, జాతి అంటూ అందరినీ విభజిస్తూ ఉన్నారన్నారు బాల మారం రెడ్డి. ఇతరుల జీవితాన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తూ వివక్షను రేకెత్తిస్తూ ఉన్నారని బాల మారం రెడ్డి అన్నారు. . కలర్ కంటే పర్సనాలిటీ చాలా ముఖ్యమని అన్నారు బాల మారం రెడ్డి.

Advertisement

M1

మూడో క్లాస్ లో ఉన్నప్పుడే తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టానని.. అప్పుడే కరాటే వైపు తాను దృష్టి పెట్టానని తెలిపారు మేఘన. తన తల్లిదండ్రులు కూడా అందుకు ఒప్పుకున్నారని.. చాలా బిజీ షెడ్యూల్ లో నేను కరాటేను నేర్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను కిక్ బాక్సింగ్ వైపు కూడా వెళ్లానని చెప్పింది. అలా ఏదైనా కానీ నేర్చుకోవాలని అనుకున్నానని తెలిపారు మేఘన.

Next Story
Share it