మెగాస్టార్-కొరటాల సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

By Newsmeter.Network  Published on  16 Jan 2020 10:55 AM GMT
మెగాస్టార్-కొరటాల సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

క్లాస్ సినిమాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ అధికారిగా చిరు ఈ చిత్రంలో కనిపిస్తారు. అందుకే ఈ సినిమాకి టైటిల్ కూడా సాఫ్ట్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు 'గోవింద ఆచార్య' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పరిగణనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో అనే అనుమానం అభిమానుల్లో ఉంది. కానీ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నిజంగానే ఈ టైటిల్ నే కొరటాల, చిరులు ఒకే చేసిన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టైటిల్ బట్టి చూస్తే ఈ సినిమాలో కొరటాల బలమైన సామాజిక సందేశం ఇవ్వబోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రాన్ని కూడా సైరాలా పాన్ ఇండియా మూవీగా చేయాలని ఆలోచిస్తోంది చిత్రబృందం. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తే గనుక అప్పుడు త్రిష ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవచ్చు. కొరటాల మెగాస్టార్ కోసం దేవాలయల భూమికి సంబంధించి మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథను తయారు చేసారు. ఇక ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. 2020లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ గా ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నారు. ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్లు ఇప్పటికే ఖరారయ్యారు గాని, ఇంకా కొంతమంది నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది.

Next Story