'అందరివాడు' కావాలనే అన్నయ్య ఆరాటమా?
By Newsmeter.Network Published on 7 Jan 2020 9:05 AM ISTముఖ్యాంశాలు
- మొన్న మోహన్‌బాబుకు ముద్దు
- నిన్న విజయశాంతికి హగ్
రెండు ఫంక్షన్లలో మెగాస్టార్ చిరంజీవిని గమనించిన వారికి కనిపించిన విజువల్స్. వీరిద్దరితో చిరంజీవికి చాలా కాలంగా మాటలు లేవు. కనీసం పలకరింపులు కూడా లేవు.
గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత విజయశాంతితో గ్యాప్ పెరిగింది. చిరంజీవి పక్కన ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేయలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత చిరంజీవి విజయశాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారానే కలిశారు. విజయశాంతితో చిరంజీవి మాట్లాడిన విధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.
ఇటు మా ఫంక్షన్‌లో కూడా మోహన్‌బాబుతో చిరంజీవి సఖ్యతగా వ్యవహరించారు. రాజకీయాల్లో,సినిమాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని సిగ్నల్స్ పంపారు. మొత్తానికి పాత శత్రువులతో చిరంజీవి కూల్‌గా వ్యవహరించడం వెనుక కారణమేంటి? అందరివాడు కావాలనే కోరిక ఆయనలో మొదలైందా? రాజకీయాలు విడిచిపెట్టిన తర్వాత ఇండస్ట్రీ పెద్ద కావాలని ఆయన అనుకుంటున్నారా?
దాసరి ప్లేస్‌పై చిరు కన్ను.!
సినీ ఇంస్ట్రీలో నిన్న మొన్నటిదాకా ఏ సమస్య వచ్చినా..ఇండస్ట్రీ మొత్తం దర్శకరత్నదాసరి నారాయణరావు దగ్గరకు వెళ్లేవారు. కానీ ఆయనిప్పుడు లేరు. ఆయన మరణం తర్వాత ఆప్లేస్ ఖాళీగా ఉంది. ఆ ప్లేస్‌ను ఇప్పుడు చిరంజీవి భర్తీ చేయాలని అనుకుంటున్నారట. అందుకే ఇంతవరకు ఆఫ్ లైన్ లోనే అడపా దడపా తీర్పులిచ్చే చిరంజీవి..ఇప్పుడు ఆన్ లైన్లోకి వచ్చేశారు. నా హీరో..ఆ హీరో...పక్క హీరో అన్న బేధం లేకుండా అందరి తలలో నాలుకలా మారిపోయారు.
టాలీవుడ్ పెద్దాయన చిరంజీవి
సినీ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించాలంటే ప్రభుత్వాల మద్దతు అవసరం. అందుకే సైరా సినిమా టైమ్‌లో వెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఆయనతో లంచ్‌మీటింగ్ పెట్టారు. ఆతర్వాత విశాఖకు రాజధాని మార్పుకు మద్దతు ప్రకటించారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఇటీవల ఓ టీవీ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఇటు ప్రభుత్వాధినేతలు....అటు సినిఇండస్ట్రీలో అన్ని గ్రూపులను తన గుప్పిట్లో పెట్టుకుని....ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించాలని చిరంజీవి చూస్తున్నారట. ఇదీ ఫిల్మ్‌నగర్ టాక్.