అరె..మెగాస్టార్ అల్లుడు మరొకటి మొదలెట్టాడు !

By రాణి  Published on  5 Feb 2020 11:12 AM GMT
అరె..మెగాస్టార్ అల్లుడు మరొకటి మొదలెట్టాడు !

ఇప్పటికే మెగా హీరోల సంఖ్య పెరిగిపోయింది అనుకుంటే.. మధ్యలో నేను కూడా మెగా అల్లుడినే అంటూ వచ్చాడు కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడిగా పరిశపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రం 'విజేత'తో నటుడిగా బాగానే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన రెండవ చిత్రం 'సూపర్ మచ్చి' ముగింపు దశకు చేరుకోవడంతో మూడో చిత్రాన్ని కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేయబోతున్నారు.

కాగా అభిషేక్ ఆగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలోని ఇతర నటీ నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఇక కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన 'విజేత' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు.

ఇక పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి పలు హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ‘శ్రీధర్ సీపాన’ కళ్యాణ్ దేవ్ సినిమా కోసం ఎలాంటి కథాకథనాలను రాశాడో చూడాలి. ప్రస్తుతం 'కళ్యాణ్ దేవ్' నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండువ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొత్తానికి మెగా అల్లుడు వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.Next Story
Share it