మేడారం: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర తేదీలను జాతర పూజారులు ప్రకటించారు. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను ఈ జాతరలో కొలుస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారంలో ఈ జాతర జరుగనుంది. పూర్తిగా కోయ సంప్రదాయంలో ఈ జాతర జరుగుతుంది. ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి 2 కోట్లకు మందికి పైగా భక్తులు హాజరవుతారు. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం. మూడు రోజులపాటు జరిగే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. రెండేళ్లకోసారి ఈ జాతర జరగనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది.

జాతర తేదీల వివరాలు

ఫిబ్రవరి 5 న బుధవారం సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.

ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.

ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.