పుణె: విశాఖ టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా పుణె టెస్ట్‌లో దుమ్ములేపుతుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. అంతేకాదు..భారీ స్కోర్‌ దిశగా టీమిండియా బ్యాట్స్‌మెన్లు పరుగులు తీస్తున్నారు. మయాంక్ అధ్భుతమైన శతకంతో రాణించాడు. మంచి టైమింగ్‌, ఫుట్ వర్క్‌తో సఫారీ బౌలర్ల నుంచి మయాంక్ పరుగులు రాబట్టాడు. 112 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన మయాంక్‌.. 195 బంతుల్లో సెంచరీ బాదాడు(108). టీమిండయా స్కోర్ 198 వద్ద మాయంక్‌ రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

Kagiso Rabada was the pick of the South African bowlers, taking all three wickets to fall.

రయ్‌మంటూ దూసుకోచ్చిన రబడ బంతులు

రబడ ఎంత వేగంగా బంతులు వేస్తున్న టీమిండియా స్కోర్‌కు బ్రేక్‌ వేయలేకపోయాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 273పరుగులు చేసింది. సఫారీ ఫేసర్ రబడ 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరాడు. రోహిత్, పుజారా, మాయంక్ వికెట్లను రబడ తన అద్భుతమైన బంతులతో పడగొట్టాడు.

Kagiso Rabada struck early for the visitors, removing the in-form Rohit Sharma.

అర్ధ సెంచరీలతో రాణించిన కోహ్లీ, పూజారా

ఛతుశ్వర్‌ పూజారా 112 బంతుల్లో 58 పరుగులు చేశాడు. దీనిలో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. రెండో వికెట్‌కు మయాంక్‌, పూజారా కలిసి టీమిండియాకు బలమైన భాగస్వామ్యాన్ని ఇచ్చారు. రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం . అద్భుతమైన టెక్నిక్‌ సఫారీ స్పిన్నర్లను పూజారా ఎదుర్కొన్నాడు. పూజారా కూడా రబడ వేసిన బంతికి అవుటై పెవిలియన్ చేరకున్నాడు. ఇక..కెప్టెన్‌ విరాట్ 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. తీ 63 పరుగుల్లో 10ఫోర్లు ఉండటం విశేషం. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్‌ 273/3

Virat Kohli scored an unbeaten half-century to stud India's day of dominance.

ఊసురుమనిపించిన హిట్ మ్యాన్‌
విశాఖ టెస్ట్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన రోహిత్ పుణె టెస్ట్‌లో 14 పరుగులకే వెనుదిరిగాడు. 35 బంతుల్లో ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి అవుటయ్యాడు. రబడ వేసిన అద్భతమైన బంతి రోహిత్‌ను పెవిలియన్‌కు పంపింది. కీపర్‌ డీకాక్‌ క్యాచ్ పట్టడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.