విశాఖ: రోహిత్ – మయాంక్ విశాఖ తీరంలో మాయ చేశారు. అవును..దక్షిణాఫ్రికాపై ఇప్పటి వరకు సాధ్యం కాని పార్టనర్‌ షిప్ సాధించారు. మొదటి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌ను కోహ్లీ 502/7 వద్ద డిక్లేర్ చేశారు. ఇక మయాంక్ తొలి శతకాన్నే డబుల్ సెంచరీగా మలిచాడు. అయితే..రోహిత్ డబుల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. చివరిలో స్పినర్లు చెలరేగారు. జడేజా, అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టి సఫారీలను డిఫెన్స్‌లోకి నెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు 39/3తో పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.