'మాయావతి'కి షాకిచ్చిన అధికారులు.. ఆమె ఇంటికి పవర్ కట్..
By Newsmeter.NetworkPublished on : 12 Feb 2020 8:10 PM IST

బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. కరెంట్ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఆమె నివాసానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. బిల్లులు చెల్లించిన అనంతరం కరెంట్‌ను పునరుద్దరించారు.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలో ఉన్న ఈ మాజీ సీఎం ఇంటికి బుధవారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించని కారణంగా విద్యుత్ ను నిలిపివేసినట్లు లఖన్‌వూలోని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. సుమారు రూ.67వేల విద్యుత్ బిల్లు బకాయి ఉన్నట్లు చెప్పారు. మాయావతి కుటుంబసభ్యులు వెంటనే రూ.50వేలు బిల్లును చెల్లించడంతో అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవనీ.. కరెంట్ బిల్లు చెల్లించని వారికి సరఫరా నిలిపివేయడం మామూలేనని విద్యుత్ అధికారి చెప్పారు.
Next Story