కాబుల్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో స్పాట్‌లోనే 28 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 55 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్‌హర్‌ ప్రావిన్స్ గవర్నర్ అతౌలా హోగ్యాని ఈ విషయం చెప్పారు. ఆప్టనిస్తాన్‌లోని హింసపై కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.ఇప్పటి వరకు పేలుడుకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన చేయలేదు. ఆఫ్టన్‌స్థాన్‌లోని హింసపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 42 శాతం హింస పెరిగిందని యూఎన్‌ఓ నివేదికలు చెబుతున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.