రేప్ చేసినవాడే పెళ్లాడితే..!

By అంజి  Published on  27 Jan 2020 4:26 AM GMT
రేప్ చేసినవాడే పెళ్లాడితే..!

ఎన్ని చట్టాలు వచ్చినా నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం మరిన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చి లైంగిక దాడికి పాల్పడినవారికి ఉరే సరి అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే టర్కీలో ఓ బిల్లు వివాదానికి దారి తీసింది. మహిళల రక్షణ కోసం కఠిన చర్యలు చేయాల్సింది పోయి ఏకంగా నిందితులను కాపాడే విధంగా బిల్లు ఉందని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

లైంగికదాడికి పాల్పడిన దోషులను శిక్షల నుంచి రక్షించేందుకు సహకరించేలా 'మ్యారి యువర్‌ రేపిస్ట్‌' అనే కొత్త చట్టాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకురానుంది. ఈ మేరకు జనవరి నెలాఖరులోగా టర్కీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. దీని ప్రకారం 18ఏళ్ల లోపు యువకులు యువతులపై లైంగిక దాడులకు పాల్పడితే ఆ బాధితురాలిని పెండ్లి చేసుకోవాలి. ఇక నిందితులకు ఎలాంటి శిక్ష విధించరు. అయితే త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసన మొదలైంది. ఈ బిల్లు మహిళల హక్కులను కాలరాయడంతో పాటు లైంగికదాడులకు ప్రోత్సహించడమే అవుతుందంటూ మహిళా సంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టర్కీలో చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 కాగా, బాల్య వివాహంపై 2018 ప్రభుత్వ నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో మొత్తం 4,82,908 మంది బాలికలకు బాల్య వివాహం చేశారు. టర్కీలో మహిళలు, బాలికలపై హింస ప్రబలంగా ఉంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. 38 శాతం టర్కీ మహిళలు భాగస్వామి నుంచి శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారు. 2014 లో ఇస్తాంబుల్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పురుషులు మహిళల మధ్య సమానత్వం ప్రకృతికి వ్యతిరేకం అని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇదే విషయాన్ని అతను పలుమార్లు వివిధ సందర్భాలలో చెప్పిన నేపథ్యంలో ఈచట్టానికి ఏవిధంగా ను అవకాశం కల్పించరాదని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

Next Story