అక్కినేని వారింట పెళ్లి సందడి ..!
By రాణి Published on 13 Dec 2019 10:56 AM ISTఅక్కినేని వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. పెళ్లి ఎవరికో తెలుసా ? అక్కినేని నాగార్జున అన్నయ్య వెంకట్ కుమారుడు ఆదిత్య, ఐశ్వర్యల వివాహం. వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక బుధవారం చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్, నాగార్జున సోదరి నాగ సుశీల, సుమంత్, సుశాంత్, సుప్రియ, సురేంద్ర తదితరులు హాజరయ్యారు. సమంత మాత్రం ఈ వేడుకలో మిస్ అయింది. వీరంతా దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో ''marriage celebration in akkineni family'' హ్యాష్ టాగ్ తో వైరల్ అవుతోంది. గతంలో అఖిల్ కు ఎంగేజ్ మెంట్ అయి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో నిశ్చితార్థం ఎవరికీ జరిగిందో చెప్పకపోవడంతో మళ్లీ అఖిల్ కు నిశ్చితార్థం జరిగిందేమోనని అందరూ అనుకున్నారు.
Next Story