మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
By సుభాష్ Published on 15 Oct 2020 11:02 AM GMTమావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు పార్టీ కుమురంభీం, మంచిర్యాల కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేబీఎం కార్యదర్శి అడెల్లు అలియాస్ భాస్కర్ కమిటీలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న లింగు గురువారం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట లొంగిపోయారు. జైనూరు మండలానికి చెందిన 28 ఏళ్ల లింగు రెండున్నర నెలల కిందటే మావోయిస్టు పార్టీలో చేరారు. అడేల్లు అలియాస్ భాస్కర్ దళంలో లింగు ఆదిలాబాద్ కమిటీలో పని చేశారు.
కదంబ ఎన్‌కౌంటర్ తర్వాత లింగు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..లింగుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. మరి కొంత మంది నేతలు కూడా లొంగిపోయే అవకాశం ఉందన్నారు. కాగా, గత నెల 19న కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేబీఎం డివిజన్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తప్పించుకున్నారు.