విశాఖ ఏజెన్సీ: ఇటీవల విశాఖ ఏజెన్సీ లో పోలీసులు మావో లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అరుణ గాయపడినట్లు సమాచారం. అరుణను విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ దళాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అరుణను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పూర్తైన తరువాత మరింత విచారణ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.