'సైరా' పై స్పందించిన మోహన్ బాబు. ఇంతకీ ఏమన్నాడు..?
By న్యూస్‌మీటర్ తెలుగు
మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'సైరా' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజైంది. 5 భాషల్లో రూపొందిన ఈ సినిమా పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే చిత్రం అంటూ అభినందిస్తున్నారు.
తాజాగా మోహన్ బాబు సైరా పై ట్వీట్ చేసారు. ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునే వారు కానీ... ఆత ర్వాత వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ఇంతకీ మెహన్ బాబు సైరా గురించి ఏమని ట్వీట్ చేసారంటే... నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవికి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్’ అని పోస్ట్ చేశారు.