మొద‌టి వ‌న్డే ఓడినా.. రాహుల్‌పై మాత్రం ప్ర‌శంస‌లు

By Newsmeter.Network  Published on  6 Feb 2020 1:22 PM GMT
మొద‌టి వ‌న్డే ఓడినా.. రాహుల్‌పై మాత్రం ప్ర‌శంస‌లు

టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్.. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌ లో ఉన్నాడు. ఏ స్థానంలో బరిలోకి దిగిన పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నుంచి రాహుల్ ఆట తీరు మారిపోయింది. ఓపెనింగ్‌తో పాటు వ‌న్‌డౌన్‌, మిడిలార్డ‌ర్‌లో అత‌ను స‌త్తా చాటుతున్నాడు. అదనంగా వికెట్ కీపింగ్‌ బాధ్యతలు మోస్తున్నాడు.

కివీస్‌ తో మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైనప్పటికి రాహుల్ పై మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ దిగిన రాహుల్ 64 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అందులో 3 పోర్లు, 6 సిక్సర్లు బాదాడు. రాహుల్ ఆట‌తీరుకు ముగ్ధుడైన మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ప్ర‌శంస‌లు కురిపించాడు. సోష‌ల్ మీడియాలో అత‌న్ని పొగుడుతూ పోస్టు పెట్ట‌గా.. అది వైర‌లైంది.

Manjrekars huge praise

'కేఎల్ రాహుల్ మాత్రమే 360 డిగ్రీల్లో అటు సంప్రదాయ ఇటు కళాత్మక బ్యాటింగ్‌ తో ఆకట్టుకోగలడు' అంటూ ట్వీట్‌ చేశారు. న్యూజిలాండ్‌ తో జరిగిన టీ20 సిరీస్‌ లో అత్యధిక పరుగులు చేసి కేఎల్ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గా ఎంపికయ్యాడు. రాహుల్‌పై సంజ‌య్ పోస్టు చూడ‌గానే భార‌త అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు. లైకులు, కామెంట్ల‌తో త‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేశారు.

పరిమిత ఓవ‌ర్ల క్రికెట్‌ లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రాహుల్‌.. టెస్టుల్లోనూ చోటు ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నాడు. సుదీర్ఘ పార్మాట్‌ లో చివ‌రిసారిగా వెస్టిండీస్‌పై గ‌త ఆగ‌స్టులో టెస్టు మ్యాచ్‌లోకి బ‌రిలోకి దిగాడు. రాహుల్ ప్ర‌స్తుత జోరును కొన‌సాగిస్తే త్వ‌ర‌లోనే టెస్టుల్లోకి రీఎంట్రీ.. ఇస్తాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.Next Story