వంటికి నిప్పంటించుకుని మరణించిన హైదరాబాదీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sep 2019 8:28 AM GMTహైదరాబాద్ : జీడిమెట్లలో ఆరోగ్య సమస్యలు తాళలేక 45ఏళ్ల గంటా మురళీనాయుడు అనే వ్యక్తి
వంటికి నిప్పు అంటించుకున్నాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 90 శాతం కాలిపోయిన గంటా మురళీనాయుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ..లాభం లేకపోయింది.
పోలీసులు చెప్పిన ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్ లో భార్య రమాదేవీ, కుమార్తె తో ఉంటున్న మురళి గత 10 ఏళ్లుగా ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు. పోయిన సంవత్సరం పక్షవాతం సోకి కదలలేని స్థితికి వచ్చాడు. అప్పటి నుంచీ మురళినాయుడు ఇంట్లోనే ఉంటున్నాడు.
మురళినాయుడి భార్య రోజుకూలి చేసి ఇంటిని నెట్టుకొస్తోంది. అయితే, మద్యానికి కూడా అలవాటు పడిన మురళి, తరచూ భార్య తో గొడవ పడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు.
సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి మంగళవారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. భార్యా, కుమార్తె చూస్తుండగానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. చుట్టుపక్కల జనం అతనిని కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.