మల్కాజిగిరి ప్రజలకు శాపంగా మారిన వర్షం  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 8:57 AM GMT
మల్కాజిగిరి ప్రజలకు శాపంగా మారిన వర్షం  

నీట మునిగిన కాలనీలు

నాలాలపై అక్రమ నిర్మాణాలే దుస్థితి్కి కారణమా?

మల్కాజిగిరి : రాత్రి కురిసిన వర్షానికి మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్ బాగ్, ఎన్.ఎం.డిసీ కాలనీ, రాజా నగర్, శ్రీ క్రిష్ణా నగర్, పటేల్ నగర్, మీర్జాల్ గుడా, సత్తిరెడ్డి నగర్ ప్రాంతాల్లో నాలా నీళ్లు ఇళ్లలోకి చేరాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.వర్షాలు తమకు శాపంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే దుస్థితి అంటూ వాపోయారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు.నాలాల విస్తరణ జరపకుంటే ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. వర్షాలు ధాటికి కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లు కూడా కుంగిపోతున్నాయన్నారు. అంతేకాకుంగా..వర్షం నీరుకు అడ్డుగా ఉన్నాయని ఇప్పుడు డివైడర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ముందు చూపులేని ఇలాంటి నిర్మాణాలతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని స్థానికులు వాపోతున్నారు.

Next Story