ఉఫ్.. వయసులో 46.. అందాల ప్రదర్శనలో  26 !

By Newsmeter.Network
Published on : 5 Feb 2020 9:04 PM IST

ఉఫ్.. వయసులో 46.. అందాల ప్రదర్శనలో  26 !

కొంతమంది హీరోయిన్లు వయసు పెరిగేకొద్దీ గ్లామర్ హద్దులు దాటుతూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా ముచ్చటించుకోవాల్సిన పేరు 'మలైకా అరోరా'దే. అందానికి అందం.. హోదాకి హోదా ఉన్నా.. ఈ ముదురు భామ మాత్రం ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు ఎదురుచూస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయినా.. అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి చివరికీ సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చింది. పైగా టీనేజ్ లోకి వచ్చిన కొడుకు ఉన్నా మలైకా మాత్రం తన అందాలను ప్రదర్శించడంలో అసలు మొహమాటం పడట్లేదు. గ్లామర్ కెరీర్ స్టార్ట్ మూడు దశాబ్ధాలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ అదే గ్రేస్ అదే ఫిజిక్ చూపిస్తూ.. నవతరం అందగత్తెల వెల్లువలో కూడా తన హాట్ నెస్ ను బాగానే ఎలివేట్ చేసుకుంటుంది.

మలైకాకి పోటీ ఇవ్వడానికి సైతం ఈ నాటి హీరోయిన్లు భయపడే పరిస్థితిలో ఉన్నారంటే ముదురు అందాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి అంతగా రెచ్చిపోతూ ఉంటుంలేండి మలైకా. అయితే ఎంత చూపించినా మలైకాకు మాత్రం అంతగా అవకాశాలేవీ లేవు. అడపాదడపా కొన్ని షోల కనిపిస్తున్నా.. సినిమాల్లో మాత్రం పెద్దగా మెరవలేకపోతుంది. అయితే ఈ సీనియర్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ హాట్ ఫోటో షూట్లతో చెలరేగుతూ యూత్ కి అన్ లిమిటెడ్ ట్రీట్ ని అందిస్తూ ఉంది. తాజాగా మరో హాట్ ట్రీట్ తో అంతర్జాలంలో అగ్గి రాజేసింది. Malaika Arora

ప్యూర్ రెడ్ డ్రెస్ లో మలైకా ఇచ్చిన ఫోజు ప్రస్తుతం యూత్ ను ఒక ఊపు ఊపేస్తోంది. వయసు 46 ప్లస్ లో ఉన్నా.. ఈ అమ్మడిలో వేడి ఎంతమాత్రం తగ్గలేదని ఈ హాట్ లుక్స్ చూస్తేనే అర్ధమవుతుంది. అసలు ఈ ఫోటోలు పరిశీలనగా చూస్తుంటే.. మలైకాకు 46 సంవత్సరాలు అంటే నమ్మలేం. ఏమైనా వయసులో 46.. అందాల ప్రదర్శనలో 26 అని నెటిజన్లు సరదగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story