గ‌ణ‌తంత్ర దినోత్సవం వేళ దేశంలో భారీ పేలుళ్ల‌కు ఉగ్ర‌వాదులు ప‌న్నిన కుట్ర‌ల‌ను జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు భ‌గ్నం చేశారు. పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను అజీజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సహిల్‌ ఫరూక్‌ గోజ్రి, నజీర్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు. వీరిని శ్రీన‌గ‌ర్ చెందిన వారిగా గుర్తించిన‌ట్లు జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్ తెలిపారు.

ఉగ్రవాదుల నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లను పోలీసులు సీజ్‌ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడితో 40 మంది జవాన్లను బలితీసుకున్న జైషే మహ్మద్‌ భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.