హాలీవుడ్ యానిమేషన్ మూవీలో.. మ‌హేష్ కూతురు సితార

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 6:19 AM GMT
హాలీవుడ్ యానిమేషన్ మూవీలో.. మ‌హేష్ కూతురు సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దల కూతరు సితార. అయితే సితార చిన్నవయసులోనే త‌న‌కు న‌చ్చిన పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ... అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటోంది. ఇటీవల దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయ‌డం తెలిసిందే.

ఇకపోతే ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న హాలీవుడ్ భారీ యానిమేటెడ్ మూవీ ఫ్రోజెన్-2. ఇదీ తెలుగు వర్షన్ లోని బేబీ ‘ఎల్సా’ పాత్రకు సితార తన వాయిస్ ని అందిస్తుండ‌డం విశేషం.

ఈ విషయాన్ని ప్రఖ్యాత డిస్నీ సంస్థ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే తన టాలెంట్ తో మంచి పేరు సంపాదించిన సితార, తొలిసారి ఒక హాలీవుడ్ మూవీకి వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు శుభాభినందనలు తెలియచేస్తున్నారు.

Next Story
Share it