సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అనే సినిమా చేస్తున్నారు. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు వంశీ పైడిప‌ల్లి, ప‌ర‌శురామ్ ల‌తో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్… మ‌హేష్ బాబుతో సినిమా చేయాల‌ని స్ర్కిప్ట్ రెడీ చేసాడు. ప‌ర‌శురామ్ మ‌హేష్ ని క‌లిసి క‌థ చెప్ప‌డం కూడా జ‌రిగింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో మూవీ క‌న్ ఫ‌ర్మ్ అంటూ ప్ర‌చారం కూడా జ‌రిగింది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే… ఏమైందో ఏమో కానీ… మ‌హేష్ ప‌రశురామ్ కి నో చెప్పాడ‌ని తెలిసింది.

అందుక‌నే ప‌ర‌శురామ్ అఖిల్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడ‌ట‌. అఖిల్ తో  రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ చేసేందుకు స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై అఖిల్ కానీ, ప‌ర‌శురామ్ కానీ స్పందిస్తాడేమో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.