ఆ.. మూవీ ట్రైల‌ర్ బాగుంది అంటూ ప్ర‌శంసించిన మ‌హేష్ బాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 6:30 AM GMT
ఆ.. మూవీ ట్రైల‌ర్ బాగుంది అంటూ ప్ర‌శంసించిన మ‌హేష్ బాబు

సినిమా బాగుంటే... ఈ సినిమా గురించి ప‌ది మందికి తెలియాల‌ని.. మ‌హేష్ బాబు ఫీల‌యితే వెంట‌నే ఆ సినిమాపై త‌న అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోవ‌డం సూప‌ర్‌స్టార్‌కు అల‌వాటు. అది చిన్నా సినిమానా..? పెద్దా సినిమానా..? అనే తేడా లేకుండా ఎలాంటి సినిమాకైనా తన బెస్ట్ విషెస్ అందిస్తారు. అస‌లు విష‌యానికి వ‌స్తే... 'ఉరంతా అనుకుంటున్నారు' అనే సినిమా ట్రైల‌ర్ గురించి మ‌హేష్ స్పందించారు.

మంచి ఆదరణ పొందుతున్న 'ఊరంతా అనుకుంటున్నారు' ట్రైలర్ వీక్షించిన మహేష్ ప్రతి సీన్ ని ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ట్రైలర్ రిఫ్రెషింగ్ గా అనిపించిందని సూపర్ స్టార్, కథనాయకుడి న‌వీన్ విజ‌య్ కృష్ణ‌కి విషెస్ అందించారు. ఇక చిత్ర యూనిట్ ని కూడా అభినందిస్తు సినిమా విడుదల సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Next Story
Share it