మహేష్ ఫొటో షూట్ లో అపశృతి

By రాణి  Published on  25 Dec 2019 10:41 AM GMT
మహేష్ ఫొటో షూట్ లో అపశృతి

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఫొటో షూట్ లో అపశృతి చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు ఫొటో షూట్ జరుగుతుందని, మహేష్ తో ఫొటో షూట్ కావాలనుకునే వారు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా AK ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఇది చూసిన ప్రిన్స్ ఫ్యాన్స్ తెలుగు రాష్ర్టాల నుంచి భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే మహేష్ తో ఫొటో షూట్ జరుగుతున్న క్రమంలో వేలాది మంది అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి అక్కడ ఏర్పాటు చేసిన బార్ గేట్స్ విరిగిపడ్డాయి.

ఈ ప్రమాదంలో కొంతమంది అభిమానులు గాయాలు కాగా..ఇద్దరికి కాళ్లు విరిగాయి. గాయపడిన వారందరినీ సన్ షైన్ ఆస్పత్రికి తరలించారు. కాగా...గచ్చిబౌలిలో మహేష్ తో ఫ్యాన్స్ ఫొటో షూట్ గురించి స్థానిక పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు AK ఎంటర్టైన్ మెంట్ పై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ బాబు హీరోగా, రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే క్రిస్మస్ కానుకగా మహేష్ తో ఫొటో షూట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Next Story
Share it