మళ్లీ పాన్ ఇండియా ప్లాన్.. ప్లాష్ బ్యాక్ లో అదే రోల్.!

By Newsmeter.Network  Published on  25 Dec 2019 3:20 AM GMT
మళ్లీ పాన్ ఇండియా ప్లాన్.. ప్లాష్ బ్యాక్ లో అదే రోల్.!

కూల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారట. కాకపోతే ఆ రోల్ కేవలం పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉంటుందట. ఇక ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేవాలను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అన్నట్లు ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారట. అయితే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా మూవీగా చేయాలని ఆలోచిస్తోంది చిత్రబృందం. ఒకవేళ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తే అప్పుడు త్రిష ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవచ్చు.

ఇక కొరటాల చిరు కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథను తయారు చేసారట. ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. 2020లో స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ గా ఆగస్టు 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్నారు.

Next Story
Share it