'సరిలేరు నీకెవ్వరు'కు 'U/A'.. సెన్సార్ టాక్ ఏంటంటే.. !

By Newsmeter.Network  Published on  2 Jan 2020 1:39 PM GMT
సరిలేరు నీకెవ్వరుకు U/A.. సెన్సార్ టాక్ ఏంటంటే.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. సినిమాలో ఏవేవి హైలైట్ అవ్వబోతున్నాయి అనే అంశాలను సెన్సార్ బృందం లీకులు ఇస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'U/A ' సర్టిఫైను తెచ్చుకుంది. సినిమాని చూసిన సెన్సార్ టీమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని.. సినిమాలో మహేష్ బాబు - విజయశాంతి ట్రాక్ సినిమాలోనే హైలైట్ అవుతుందని.. మెయిన్ గా వారి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని.. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ తో పాటు మహేష్ కామెడీ టైమింగ్ కూడా సెకెండ్ హాఫ్ లో చాల కొత్తగా ఉండబోతుందని.. అలాగే బండ్ల గణేష్ - మహేష్ బాబు మధ్య ట్రైన్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని.. ఓవరాల్ గా సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని సినిమా చూసిన సెన్సార్ టీమ్ నుండి లీకులు వినిపిస్తున్నాయి.

మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్ బేస్ అండ్ యాక్టింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ అండ్ టైమింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెడతాయి. పైగా భారీ కాస్టింగ్ మరియు బ్యూటిఫుల్ విజువల్స్ తో సినిమా ప్రేక్షుకులకు గొప్ప అనుభూతిని ఇస్తోంది. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతికి ఫేవరేట్ మూవీగా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.Next Story
Share it