శాస్త్రవేత్తల ఎన్నో ఏళ్ల శ్రమ, విస్తృత పరిశోధన ఫలించాయి. 9వ శతాబ్దం నాటి ‘మహేంద్ర పర్వత నగరం’ జాడ దొరికింది. కంబోడియాలోని ఫ్నామ్‌ కులెన్‌ పర్వతాల్లో మహేంద్ర పర్వత నగరం ఆనవాళ్లను కనుగొన్నారు. 30 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ‘మహేంద్ర పర్వత నగరం’ విరాజిల్లింది. అధునాతన ఏరియల్‌ మ్యాపింగ్‌ ద్వారా ఆ నగరాన్ని కనుగొన్నారు. 9వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఆగ్నేయ ఆసియాను పాలించిన శక్తిమంతమైన ‘ఖ్మేర్‌ సామ్రాజ్యానికి’ మహేంద్ర పర్వత నగరమే రాజధాని.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.