మహబూబాబాద్: ఆ రైతుకు రెవిన్యూ అధికారులు మీద కోపం వచ్చింది. కోపం అంటే మాములు కోపం కాదు. చాలా కోపం. ఎంత కోపమంటే..తన పొలంలోనే గోతి తీసి తనను తాను పూడ్చకోబోయాడు. ఆ రైతుకు  రెవిన్యూ అధికారులపై ఎందుకంత కోపం వచ్చింది..? వారు ఏంచేశారు..?  ఆ రైతుకు సంబంధించిన పట్టా డాక్యుమెంట్లను ..రెవిన్యూ అధికారులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆ అన్నదాతకు మండిపోయింది. స్థానిక ఎమ్మెల్యేనే పట్టా ఇవ్వొద్దని ..రెవిన్యూ అధికారులు చెబుతున్నారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.