మధురై ఏయిర్ పోర్ట్ లో 23 తుపాకుల పట్టివేత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 9:12 AM GMT
మధురై ఏయిర్ పోర్ట్ లో 23 తుపాకుల పట్టివేత

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ లో ఉగ్రదాడి ముప్పు ఉండవచ్చని సమాచారాలు వస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ భారత్ లో హై అలర్ట్ ప్రకటించారు. కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇలాంటి తరుణంలో మధురై ఎయిర్ పోర్టులో 23 తుపాకులు లభ్యమవడం అందరినీ షాక్ కు గురిచేసింది. భారీ సంఖ్యలో తుపాకులు దొరకడం, ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది. స్పైస్ జెట్ విమానంలో 23 తుపాకులను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారుల సోదాల్లో 23 తుపాకులు బయటపడ్డాయి. వీటి విలువ 17 లక్షల పైనే అట..! ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా స్పైస్ జెట్ విమానంలో కొందరు ప్రయాణికులు వీటిని తరలిస్తున్నారు. వీటిని షూటింగ్ ప్రాక్టీస్ కోసమని చెబుతున్నప్పటికీ.. ఇండియన్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి కూడా ఎలాంటి అనుమతులూ లేవు. అది కూడా దుబాయ్‌ నుంచి శివగంగైకు తరలిస్తూ పట్టుబడ్డారు. అజ్మల్‌ఖాన్‌, కోలిక్ మహ్మద్, మునిజ్పూ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గుర్నీ సెక్యురిటీ కెమేరాలు పసిగట్టడంతో ఎయిర్ పోర్టు అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా 23 తుపాకులు బయటపడ్డాయి.

Next Story