సుజనా బీజేపీ నేతా?.. చంద్రబాబు ఏజెంటా?: మచిలీపట్నం వైసీపి ఎంపీ బాలశౌరి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 4:22 PM ISTపేరుకేమో మోదీ ప్రభుత్వం..పనిచేసేదేమో చంద్రబాబు కోసమంటూ .. సుజనాచౌదరిపై మచిలీపట్నం వైసీపీ ఎంపీ బాలశౌరి పైర్ అయ్యారు. బీజేపీలో చేరింది రాష్ట్ర ప్రయోజనాలా కోసమా? చంద్రబాబు ప్రయోజనాల కోసమా? అని సూటిగా ప్రశ్నించారు. సుజనా చౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడం కోసమేనని బాలశౌరి ఆరోపించారు. సీఎం జగన్, అమిత్ షాతో భేటిపై.. వివవరాలను అధికారికంగా బీజేపీ కానీ..కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించాలి. మధ్యలో నీవెవరు చెప్పడానికి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి డూప్లీకేట్ బీజేపీ నేతల మాటలకు ఎక్కడా విలువ ఉండదన్నారు.
నిజమైన బీజేపీ నేతంటే జీవీఎల్. ఆయన భేటీ జరిగిన రోజే పూర్తిగా వివరించారు. నీవు మాత్రం చంద్రబాబు ఏజెంట్‌లా ఢిల్లీలో విషపు కూతలు కూస్తున్నావని ఆరోపించారు. సుజనా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చట్టసభను కోరుతామన్నారు. ఇప్పటికే రాజ్య సభలో జీవీఎల్ నీపై ఫిర్యాదు చేసిన విషయం గుర్తుందా? అని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి, డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్ట సభలలోకి రాకుండా వుండేలా ఎంపీలమంతా కలిసి పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెడతామని బాలశౌరి చెప్పారు.