కామునిపల్లిలో యువతి, యువకుడు బలవన్మరణం

By Newsmeter.Network  Published on  6 Feb 2020 5:39 AM GMT
కామునిపల్లిలో యువతి, యువకుడు బలవన్మరణం

వారిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడంలో తప్పులేదుగాని.. వారిద్దరు వరుసకు అక్కాతమ్ముడు అవుతారు. వారి ప్రేమకు ఇంట్లో ఒప్పుకోలేదు. వద్దని వారించారు. కలిసి బలికే అవకాశం లేదని.. కలిసి చావాలని నిర్ణయించుకుని.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రశాంత్‌ (19) పదో తరగతి వరకు చదువుకున్నాడు. అతని తల్లిదండ్రులు నగరంలో సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20) డిగ్రి చదువుతోంది. వీరిద్దరు వరుసకు అక్కాతమ్ముడు అవుతారు. కొంతకాలంగా ప్రశాంత్, యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు విషయం తెలుసుకొని వారించారు. అయినా, యువతి, యువకుడు తమ ప్రేమను కొనసాగించారు. ప్రశాంత్‌ సోమవారం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం యువతితోపాటు ప్రశాంత్‌ తన ఇంట్లో ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పక్కింటి వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ తండ్రి గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story
Share it