అమరావతి: వైఎస్‌ఆర్‌ కాగ్రెస్‌ పార్టీకి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. బ్లూఫ్రాగ్‌ కంపెనీతో తనకు సంబంధం ఉందని నిరూపించండి అంటూ.. ఆయన ఛాలెంజ్‌ చేశారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను ఆత్మహత్య చేసిన వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం..తన చేతగాని పాలన నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మరో కుట్రకి తెరలేపారని లోకేష్ ఆరోపించారు. గతంలో కూడా జగన్‌ నాపై ఆరోపణలు చేశారని లోకేష్‌ మండిపడ్డారు. వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడింది. కానీ..పోలీసులే అక్రమ రావాణాను ప్రోత్సహిస్తున్నారు అంటూ తలో మాటా చెప్పిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ఇప్పుడు తనపై అసత్య ప్రచారాలకు తెర లేపారన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.