బ్రేకింగ్‌: దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత: కేసీఆర్‌

By సుభాష్  Published on  11 April 2020 4:09 PM GMT
బ్రేకింగ్‌: దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత: కేసీఆర్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌పై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. ఏప్రిల్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ అధికంగా ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ పొడిగించక తప్పదని అన్నారు. ఇక 30 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు కూడా అన్ని విధాలుగా సహకరించాలని అన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి వచ్చిన 1200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, పాజిటివ్‌ వచ్చిన వారందరీకి చికిత్స నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని అన్నారు. నాలుగు రోజులూ ఓపిక పడితే కరోనా కష్టాల నుంచి గట్టెక్కుతామని అన్నారు.

Next Story
Share it