ఇంగ్లండ్‌లో ఇక విడాకులు కేసుల లైవ్ స్ట్రీమింగ్

By అంజి  Published on  14 March 2020 9:30 AM GMT
ఇంగ్లండ్‌లో ఇక విడాకులు కేసుల లైవ్ స్ట్రీమింగ్

లండన్‌: ఇకపై విడాకుల కేసుల్లో వాద ప్రతివాదాలను ప్రజలందరి కోసం లైవ్ స్ట్రీమ్ చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టుల్లో జరగే ఈ వాదాలను లైవ్ లో కక్షిదారులు, వారితో సంబంధం ఉన్న వారు యూట్యూబ్, ఫేస్ బుక్ ల ద్వారా వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల విడాకుల చట్టం విషయంలో అవగాహన పెరుగుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం న్యాయమూర్తులదే.

అయితే లైవ్ స్ట్రీమింగ్ ఒక నిముషం ఆలస్యంగా జరుగుతుంది. దీని వల్ల పరస్పరం తిట్టుకోవడం వంటి దృశ్యాలు బహిర్గతం కాకుండా ఉంటాయి. లైవ్ స్ట్రీమింగ్ లో జడ్జి, లాయర్లు, వాదులు, ప్రతివాదులను మనం చూడవచ్చు. వాదులకు, ప్రతివాదులకు లైవ్ స్ట్రీమింగ్ గురించి ముందే తెలియచేస్తారు. గతేడాది కొన్ని కేసులను లైవ్ స్ట్రీమ్ చేయగా వచ్చిన అనుభవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా క్లిష్టమైన కేసులను పరిష్కరించడంలో న్యాయమూర్తులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి తెలియచేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం న్యాయ శాఖ చెబుతోంది.

బ్రిటిష్ న్యాయ వ్యవస్థ తీసుకుంటున్న చర్యల వల్ల విడాకుల రేటు బాగా తగ్గింది. గతేడాది గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 90751 కేసులలో మాత్రమే విడాకులు పొందడం జరిగింది. గత పన్నెండు నెలల్లో దాదాపు 12 శాతం వరకూ విడాకులు తగ్గాయని గణాంకాలు తెలియచేస్తున్నాయి. మగ ఆడవారి మధ్య జరిగిన వివాహాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. కానీ సమ లైంగిక వివాహాల్లో విడాకుల శాతం మాత్రం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

Next Story